India vs Sri Lanka 3rd Test Preview :Team India aims 9th straight Series win | Oneindia Telugu

2017-12-01 51

Sri Lanka appear to have neither the gameplan nor the resources to halt India’s seemingly inexorable march towards a record-equalling ninth consecutive series victory when the neighbours clash in the third and final test on Saturday

మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా శనివారం (డిసెంబర్ 2)న మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్టులో కోహ్లీసేన గెలిచిన లేదా డ్రా చేసుకున్నా ప్రపంచ రికార్డుని సమం చేయనుంది.ఇంతకీ ఆ ప్రపంచ రికార్డు ఏంటని అనుకుంటున్నారా? కోహ్లీసేన ఇప్పటివరకు 8 టెస్టు సిరిస్ విజయాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ వేదికగా జరిగే మూడో టెస్టులో కోహ్లీసేన గనుక విజయం సాధిస్తే 2005-08 మధ్య ఆస్ట్రేలియా సాధించిన వరుస సిరీస్ విజయాల రికార్డును సమం చేస్తుంది.
ఇక వచ్చే ఏడాది కోహ్లీసేన దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో ఆతిథ్య దక్షిణాఫ్రికాతో మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ ఆడనుంది. జనవరి 5 నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టెస్టు సిరిస్‌లో దక్షిణాఫ్రికాను సొంత గడ్డ మీద ఓడిస్తే.. పది సిరీస్‌ల్లో వరుసగా గెలుపొందిన జట్టుగా టీమిండియా అరుదైన రికార్డును సొంతం చేసుకుంటుంది. 2015లో శ్రీలంక పర్యటనతో భారత్ టెస్టు విజయాల పరంపర మొదలైన సంగతి తెలిసిందే. లంకను సొంత గడ్డపై కోహ్లీసేన వైట్‌వాష్ చేసింది.